Category Archives: Uncategorized

ప్రేమ


నేను నిన్నే ప్రేమించా
నీ నవ్వును ఆశించా
నువ్వు నా కలలో కనిపించి
ఎన్నో ఊసులు సృష్టించావు

ప్రతి నిత్యం నీ ధ్యాసే
అనుక్షణం నీ ఊసే
నువ్వు నా ఎదుటే ఉన్నట్టే
అనిపిస్తూ ఉంటుందే..

నేను నిన్నే ప్రేమించా
నా మనసే నీకిచ్చా!

ఊపిరి ఆగుతున్నదే
కాలం మారుతున్నదే..


			

Leave a comment

Filed under Uncategorized

అమావాస్య రాత్రి …


అది ఓ అమావాస్య రాత్రి ..
నా గమ్యానికై పయనిస్తున్న రాత్రి ..
ఆ త్రోవకి అటుగా ఓ ఊడల మఱ్ఱి ..
ఆ ఊడలపై ఊగే tela తెల్లటి ఆకృతి ..

ఆ రూపం సమీపిస్తుండగా ..
నా దేహం గగుర్పొడచగా ..
రోమాలు నిక్క పొడచగా..
బెదురు బెదురుగా ..

చుట్ట్టు పరికిస్తూ ..
వడి వడిగా అడుగులేస్తుంటే ..
తారసపడే వందల మఱ్ఱిలు ..
వందలాది తెల్లటి ఆకృతులు ..

ఆ ఆకృతులు నా పాలిట మృత్యువులా ఊగుచుండగా ..
కారు చీకటిi కాల రాత్రిలా బుసలు కొడుచుండగా ..
నా హృదయం మరణ మృదంగం వాయించుచుండగా ..
ఈ అమావాస్యని ఛేదించి గమ్యం చేరేనా ???????????

 

……నల్లమల

2 Comments

Filed under Uncategorized

సఖి .. నీ ప్రేమకై ….


respond to it romantically…hail love!!!

సఖి ..ఓ నా ప్రియ సఖి …
నిను చూచిన క్షణాన ..
నా కను రెప్పలు వాల్చుట మరచి ..
హృదయ కవాటాలు నియంత్రణ విడచి ..
నీ సొగసుకు ..నా మనసు పరవశించి ..
నీ హొయలకు ..నా తనువు పులకరించి ..
నీకై నా పాదాలు నిను అనుకరించాయి .

పగలంతా నీ ధ్యాసే ..రేయంతా నీ ఊసులే..

నువ్వు సయ్యంటే ..
నీ కను రెప్పకు కాటుకవుతా ..
నీ కొప్పుకు సిగనవుతా ..
నీ వాలు జడకు గంటనవుతా ..
నీ రవిక బంధనానికి ముడినవుతా ..
నీ చీర కట్టుకు కుచ్చిళ్ళవుతా ..

నీ ప్రేమకై ..ఈ నరీ నిరీక్షణ ….

…….by naree..naresh.

 

2 Comments

Filed under Uncategorized

తెలంగాణ ఆవేదన కవిత ..


రజాకార్లు రాకాసులాi ..ప్రజల గుండెల్లో పరిగెడుతుంటే …
ఆవేదన చెంది ..అక్రాందన పొందిన నేల …
నల్లమల గిరిప్రసాద్ పోరాడిన నేల …
చెరబండ రాజు పాడిన నేల …
కావాలి ఈ నేల తెలంగాణ రాష్ట్రం ..

రైతుల పొలాలు ఎండిపోయి …వారి శ్వాస రోదించి … ఆత్మ గోశించినా …
నిరుద్యోగ యువత రోడ్డున పడి…దిక్కులు పిక్కటిల్లేలా వెక్కి వెక్కి ఏడ్చినా …
ఎందుకు స్పందించదు ప్రభుత్వం …
కావాలి ఈ నేల తెలంగాణ రాష్ట్రం ..

 

…by..comrade Nallamala Naresh

 

Leave a comment

Filed under Uncategorized

Telangana biddani aavedana…


 

తెలంగాణ బిడ్డడో ….
నీ బతుకేమో చితికి పాయె
మరి రాష్టమేమో రాకపాయె ….1.

రైతుల పొలాలేమో లాక్కపాయే
రేజర్వాయరులెం రాకపాయె (1)

రైతులేమో కూలీలయే
కూలీలేమో శవాలాయే (1)

చదువుకునే కాలేజీ కట్టకపాయె
చదువుకున్నా ఉద్యోగం రాకపాయె (1)

నల్లగొండ నీళ్ళేమో ఫ్లోరైడ్ ఆయే
నీళ్లు తాగిన మనుషులేమో వికలాంగులాయే (1)

…by..comrade Nallamala Naresh

Leave a comment

Filed under Uncategorized